ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆ అభ్య‌ర్థికి రోడ్డు రోల‌ర్ గుర్తు కేటాయింపు

-సాయంత్రం లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశం
-రిట‌ర్నింగ్ అధికారిని మార్చే అవ‌కాశం..?

Allotment of road roller mark back to Sivakumar: మునుగోడులో జ‌రుగుతున్న గుర్తుల కేటాయింపున‌కు ఈసీఈ ఎట్ట‌కేల‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివకుమార్కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. శివ‌కుమార్‌కు మొద‌ట రోడ్డు రోల‌ర్ గుర్తు కేటాయించిన ఎన్నిక‌ల సంఘం దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రోడ్ రోలర్ గుర్తు మార్చి బేబీ వాకర్ ఇచ్చారు. ఎన్నికల అధికారుల తీరుపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఆయ‌న కోర్టుకు వెళ్లారు. అయితే, గుర్తుల కేటాయింపు త‌దిత‌ర అంశాలు త‌మ ప‌రిధిలోకి రావ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించారు. ఆయనకు ఈ గుర్తు కేటాయించి ఆ తర్వాత రద్దు చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. సీఈసీ ఆదేశాలతో శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఆర్ఓ వివరణపై ఈ రోజు (గురువారం) సాయంత్రం 5 గంట‌ల‌లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దాని ప్ర‌కారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ నిర్ణ‌యం తీసుకోనుంది. రిట‌ర్నింగ్ అధికారిని మార్చే అవ‌కాశం ఉంద‌ని అంతా భావిస్తున్నారు.

ఈసీ ఆదేశించడంతో.. ఫారం 7(ఏ)లో సవరణ చేసి అభ్యర్థి శివకుమార్‌కు రోడ్డు రోలర్‌నే కేటాయిస్తూ తిరిగి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదే స‌మ‌యంలో బ్యాలెట్ సైతం ముద్రించేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like