పలువురు ఐఏఎస్ ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అపూర్వ చౌహాన్ను జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు. అశ్విని తానాజీని వరంగల్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ పని చేస్తున్న బీ.హరిసింగ్ ని అడ్మనిస్ట్రేటివ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరారు. బీ. రాహుల్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా నియమించారు. కొద్ది రోజులుగా ఇక్కడ పోస్ట్ ఖాళీగా ఉంది. మైనక్ మిట్టల్ ని నారాయణ్ పేట అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా చంద్రారెడ్డి స్థానంలో నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న చంద్రారెడ్డిని సైతం అడ్మనిస్ట్రేటివ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరారు. మంద మకరంద్ కు జగిత్యాల అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రఫుల్ దేశాయ్ కి జనగామ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా నియమించారు. అభిషేక్ అగస్త్యకు మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా నియమించారు. నల్గొండ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా పనచేస్తున్న రాహుల్ శర్మ స్థానంలో ఖుష్బూ గుప్తా ను నియమించగా, రాహుల్ శర్మ ని వికారాబాద్ బదిలీ చేశారు.
ఖుష్బూ