టీఆర్ఎస్ నేత రషీద్ కన్నుమూత
TRS leader Rashid passed away:టీఆర్ఎస్ నేత రషీద్ శుక్రవారం ఉదయం తుదశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొదట మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ అక్కడ నుండి హైదరాబాద్ నిమ్స్ తరలించారు. ఆయనకు ఐసీయు లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో పదవులతో పాటు కో ఆప్షన్ సభ్యడిగా పని చేసారు.