శ్రీరాంపూర్ ఏరియాలో గనులపై టీబీజీకేఎస్ నిరసన
TBGKS protest against mines in Srirampur area: వేజ్‌బోర్డు సాధించే విషయంలో జాతీయ కార్మిక సంఘాల వైఖరికి నిరసనగా సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మంగళవారం ఆందోళన చేపట్టింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లోని అన్ని గనులు, డిపార్ట్మెంట్ల పైన కార్మికులు నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు కాలపరిమితి నిండి 16 నెలలు గడిచినా జాతీయ కార్మిక సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.
కార్మికులకు 16 నెలల ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలని, బుధవారం జరిగే వేజ్‌బోర్డు సమావేశంలో అన్ని డిమాండ్లను సాధించుకురావాలన్నారు. ఎస్ఆర్‌పీ 3 గని ఆవరణలో జరిగిన నిరసనలో ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ భాస్కర్ పాల్గొన్నారు. ఆర్‌కే 7 గనిలో కేంద్ర ఉపాధ్యక్షుడు డికొండ అన్నయ్య,పిట్ సెక్రటరీ వెంకటి, ఏరియా నాయకులు అశోక్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టులో కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శంకరయ్య, ఆర్‌కే 6 గనిలో ఏరియా చర్చల ప్రతినిధి కుమారస్వామి, పిట్ సెక్రటరీ రాయమల్లు, ఏరియా నాయకులు అడ్డు శ్రీనివాస్ , శ్రీరాంపూర్ 1 గనిలో ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్,పిట్ సెక్రటరీ తిరుపతి, ఇందారం 1A , ఇందారం ఓపెన్‌కాస్టులో జరిగిన నిరసనలో ఏరియా నాయకులు జగదీశ్వర్ రెడ్డి, పిట్ సెక్రటరీలు గడ్డం మల్లయ్య, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌కే 7A గనిలో ఏరియా ఆల్టర్నేట్ కమిటీ సభ్యుడు భూస రమేష్, ఐరెడ్డి తిరుపతిరెడ్డి, ఆర్‌కే 5 గనిలో పిట్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, ఏరియా నాయకులు శ్రీనివాసరావు, సీహెచ్‌పీలో పిట్ సెక్రటరీ శ్రీనివాస చారి ,ఏరియా వర్క్ షాప్ లో పిట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు,సివిల్ డిపార్ట్మెంట్లో పిట్ సెక్రటరీ పెగ మల్లేష్, జీఎం కార్యాలయంలో పిట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు,మెడికల్ డిపార్ట్మెంట్లో నిర్వహించిన నిరసనలో పిట్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.