40 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టివేత

మంచిర్యాల జిల్లా మందమర్రిలో 40 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. రెండు ట్రాలీ వాహనాలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలిసులు వెల్లడించారు.
కొందరు వ్యక్తులు మందమర్రి చుట్టప్రక్కల గ్రామాల నుండి పీ డీఎస్ బియ్యం తక్కువ ధరలకు కొనుగోలు చేసి అమ్ముతున్నారు. సమచారం అందుకున్న మంచిర్యాల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది తో కలిసి మోటం రాజు అనే వ్యక్తి ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల PDS బియ్యం, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజును సైతం అదుపులోకి తీసుకున్నారు.