సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
Singareni: సింగరేణిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఆర్జి 3లో శనివారం ఈ ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే బట్టి జైనాధ్ కుమార్ అనే కార్మికుడు వెల్డర్ ట్రైనిగా ఆర్జి 3 లో విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి షిఫ్ట్ లో సి హెచ్ పి సర్పేస్ ఫీడర్ దగ్గర ఉదయం వెల్డింగ్ పనిని పూర్తి చేసుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో సర్పేస్ ఫీడర్ ప్రక్కన గల ఫైర్ ఎక్సనెంజర్ బ్లాస్ట్ అయ్యింది. అది జైనాధ్ కుమార్ కి తాకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఏరియా సింగరేణి ప్రధాన హాస్పిటల్ తరలించారు. వైద్యులు పరీక్షించగా చనిపోయినట్లు తెలిపారు. ఇతనికి భార్య, కుమారుడు వున్నారు. ఇతను పోతనకాలనీలోని బ్లాక్ 85 లోని క్వార్టర్ లో నివాసం ఉంటున్నాడు ఇతని స్వగ్రామం చుంచుపల్లి అని తోటి కార్మికులు వెల్లడించారు.