జనం నుంచి వచ్చిన నేత
-బాల్క సుమన్‌ను ప్రజలకు పరిచయం చేసిన ముఖ్యమంత్రి
-ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పరోక్షంగా యువతకు పిలుపు
KCR showered praises on Balka Suman:’ఇదిగో ఈయన జనం నుంచి వచ్చిన నేత… సామన్య విద్యార్థిగా ఉన్న వ్యక్తి ఎంపీ అయ్యాడు’… ఇదీ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా నాందేడ్ బహిరంగ సభలో చెప్పిన ముచ్చట. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన సభలో బాల్క సుమన్‌ను కేసీఆర్ ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ యువ నేత కాలేజీలో చదువకునే వాడు. విద్యార్థిగా ఉండగానే నాతో పాటు పోరాటం చేసిండు. 29 ఏండ్లకే ఎంపీ అయ్యాడు. ధైర్యం, నిజాయితీగా పోరాడే శక్తి ఉంది కాబట్టి నేతగా ఎదిగాడు. నాయకులు జనం మధ్య నుంచే వస్తారని చెప్పడానికి ఈయనే ఉదాహరణ’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.