ఊరికి ఉపకారి అబ్బయ్య
Manchiryal: ఎడ్ల అబ్బయ్య ఆదర్శ రైతే కాకుండా, ఊర్లో చాలా మందికి ఎంతో ఉపకారం చేశారని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. పాత మంచిర్యాలకు చెందిన అబ్బయ్య తృతీయ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు దామోదర్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పెంట రాజయ్య మాట్లాడుతూ అబ్బయ్యకు తనకు ఆప్త మిత్రుడని గ్రామంలో ఏదైనా పనులు చేయాలంటే ఆయనతో మాట్లాడి చేసేవాడినని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, మాదంశెట్టి సత్యనారాయణ, ఖాజామియా, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల శంకర్, నేతలు బొలిశెట్టి విజయ్, గరిగంటి సరోజ, తోట తిరుపతి, జగ్గారి సంజీవ్, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.