పెద్దపులి పిల్లల కలకలం
Tigress of cubs: ఒకేచోట నాలుగు పెద్దపులి పిల్లలు లభించడం కలకలం సృష్టించింది. నాలుగు పులి పిల్లలు అటవీ ప్రాంతంలో లభించడంతో వాటిని తీసుకువచ్చిన గ్రామస్తులు ఓ గదిలో భద్రపరిచి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పెద్ద గుమ్మడాపురంలోని అటవీ ప్రాంతంలో నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించాయి. అటవీ ప్రాంతంలో మేకలు కాసేందుకు వెళ్లిన కాపరులు వాటిని చూసి గ్రామస్తులకు చెప్పడంతో వారు ఆ పిల్లలను తీసుకువచ్చి కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా గదిలో భద్రపరిచి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.