న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
ప్రధానమంత్రి TB ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ ఎంపీ , హెటీరో సంస్థ అధినేత డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులకి న్యూట్రిషన్ కిట్లని TB పేషెంట్లకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ప్రజలంతా క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి సక్రమంగా సకాలంలో మందులు వాడి మందులతో పాటు బలమైన ఆహారం కూడా తీసుకోవాలని సూచించారు. 2025 క్షయవ్యాధి రహిత భారత దేశంగా ఆవిష్కృతం అవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అందుకే హెటిరో ఫౌండేషన్ వారి తరఫున వ్యాధిగ్రస్తులకు బలమైన ఆహారం తీసుకునేందుకే కిట్టుని అందజేస్తున్నానని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తుల కి న్యూట్రిషన్ కిట్ అందజేసినందుకు బండి పార్థసారధి రెడ్డికి మధిర TB యూనిట్ తరపునుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు అనిల్, వెంకటేశ్వర్లు, వెంకటేష్, పృద్వి, శ్రీనివాస్, N.సందీప్, శివ, రమాదేవి, మనోహర, శైలజ, రాజు, సుబ్బలక్ష్మి, ఫైమూన్, కొండయ్య, భాస్కర్ రావు,వెంకటేశ్వర్లు ఫైమోన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు