వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Manchiryal : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని స్టోర్రూమ్ లో మలేరియా కిట్, నివారణ సామాగ్రి మంటల్లో దగ్ధమైంది. మలేరియా పిచికారికి ఉపయోగించే మందులు, యంత్రాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. సుమారు ఐదు లక్షల రూపాయల పైనే నష్టం జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో వైద్య శాఖ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు.