‘ఒక్క నిమిషం’ నిబంధనతో అనర్థం
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1339 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన 9.65లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా, రేపటినుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:45 లోపు సెంటర్ లోపలికి వెళ్లాలని నిబంధన ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఉరుకులు పరుగులతో 8 గంటలకే సెంటర్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే నిమిషం నిబంధన, ఇతర కారణాల వల్ల పలుచోట్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు.
కొమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వివేకానంద కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు ఇద్దరు, వసుంధర జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం ఒక అబ్బాయి నిమిషం ఆలస్యం అయింది. దీంతో కళాశాల సిబ్బంది వారిని అనుమతించలేదు.