రాజన్నకు అమావాస్య ఎఫెక్ట్
Vemulawada: ప్రతి రోజూ రద్దీగా కనిపించే ఎములాడ రాజన్న ఆలయం మంగళవారం బోసిపోయింది. మంగళవారం, అమావాస్య కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఖాళీగా కనిపించారు. బుధవారం ఉగాది కావడంతో ఆలయానికి మళ్లీ రద్దీ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఆలయాన్ని అలంకరించారు.