మంత్రిని బర్తరఫ్ చేయాలి
-ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు
-నిరుద్యోగులకు ఆయన క్షమాపణ చెప్పాలి
-ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలు కామన్ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రి హోదాలో ఉండి ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు.
నిర్మల్ మున్సిపాలిటీలో సైతం 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నారని ఏలేటీ అన్నారు. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల విషయంలో మంత్రి చేసి వ్యాఖ్యలు సరి కాదన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి భూములు కబ్జాలు చేయడం, ఉద్యోగాలు అమ్ముకోవడం తప్పా నిరుద్యోగుల సమస్యలు పట్టవని మహేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. మంత్రి ఐకే రెడ్డి వెంటనే నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.