బ్రేకింగ్ మందుబాబులకు శుభవార్త..
-తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు
-తగ్గిన మద్యం ధరలు నేటి నుండి అమల్లోకి
-ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన ప్రభుత్వం
Liquor Rates: మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గినట్లు వెల్లడించింది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ ట్యాక్స్ కొంత మేర తగ్గించడంతో పలు రకాల మద్యం బ్రాండ్స్ పై ధరలు దిగొచ్చాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ పై రూ.20 మేర, ఫుల్ బాటిల్ పై రూ.40 మేర ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం అక్రమ రవాణా జరుగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిందని ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు.