హీరో అల్లు అర్జున్‌కు ఆర్టీసీ లీగల్ నోటీసులు
హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపించింది. ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీసేలా యాడ్ తీసింనందుకు అల్లు అర్జున్, రాపిడోకు నోటీసులు అందించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అల్లుఅర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చారని అన్నారు. ప్రకటనపై ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి విమర్శలు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని, ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. నటులు ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటించాలని సజ్జనార్ స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.