బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం
Inter student suicide: నారాయణ కళాశాల బాచుపల్లి బ్రాంచ్‌లో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక ఇటీవల వారం రోజుల క్రితమే క్యాంపస్‌కి వచ్చినట్లు తెలిసింది. తోటి విద్యార్థుల సమాచారం మేరకు ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే వంశిక బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె ప్రమాదావశాత్తు భవనంపై నుంచి పడిందా..? లేక ఆత్మహత్య చేసుకుందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.