ఆగస్టులో సింగరేణి గుర్తింపు ఎన్నికలు
Singareni: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగస్టులో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అంగీకారం కుదిరింది. మంగళవారం హైదరాబాదులో డిప్యూటీ CLC శ్రీనివాస్ సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఎన్నికలపై స్పష్టత వచ్చింది. సింగరేణిలో ఎన్నికల విషయంలో జూన్ 24న మళ్లీ సమావేశమై ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తామని డైరెక్టర్ పా తెలిపినట్లుగా యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ యూనియన్లకు చెందిన కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు ఎన్నో రోజులుగా కోరుతున్నాయి. కానీ, యాజమాన్యం మెలికలు పెడుతూ వస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఎన్నికలకు సుముఖంగా లేకపోవడంతో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడలేదనే ప్రచారం సైతం జరిగింది. సింగరేణిలో గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసి నాలుగేళ్లు గడిచిందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఏఐటీయూసీ గతేడాది హైకోర్టును ఇక్రయించింది. స్పందించిన హైకోర్టు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని డిసెంబర్లో అదేశాలు జారీ చేసింది. దీనిపై మార్చిలో కోర్టుకు వెళ్లిన సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి విఘాతం కలగకుండా వర్షాకాలంలో నిర్వహిస్తామని వెల్లడించింది. దీంతో జూన్ 1 నుంచి మూడు నెలలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో డిప్యూటీ చీబర్ కమిషనర్ శ్రీనివాసులు గత నెలలో అన్ని కార్మిక సంఘాలకు లేఖలు రాశారు.
కొద్ది రోజుల కిందట కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించాలని యాజమాన్యంతో పాటు సింగరేణి విస్తరించి ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. కార్మిక సంఘాలు కూడా ఎన్నికల విషయంలో తాము సిద్ధమని స్పష్టం చేశాయి. దీనిపై స్పందించిన సింగరేణి యాజమాన్యం జూన్ లో ఎన్నికలు నిర్వహించవచ్చని, వర్షాల సమయం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. దీంతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆగస్టులో ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల గడువు ముగిసి నాలుగేళ్లయ్యింది. 2017 అక్టోబర్ 5న గుర్తిం పు సంఘం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రెండేళ్ల కాలపరిమితిగా కేంద్ర కార్మిక శాఖ అందజేసింది. అధికారికంగా 2010 అక్టోబర్ తో ఎన్నికల కాల పరిమితి ముగియాల్సి ఉంది. అయితే ఎన్నికల ముందు నాలుగేళ్లు ప్రకటించి ఎన్నికల తర్వాత రెండేళ్లకు కుదించడం ఏమిటని అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హైకోర్టుకు వెళ్లింది. అలా కేసు నడుస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి.