తలాపునే గోదారి… తాగునీరేది..?
-ఎమ్మెల్యే అన్ని రంగాల్లో విఫలమయ్యాడు
-మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్

Manchiryala: మంచిర్యాల పట్టణానికి తలాపునే గోదారి ఉన్నా తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని 7వ వార్డు ఎన్టీఆర్ నగర్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఆయన ప్రభుత్వ పని తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో ప్రతిరోజు తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. తలాపునే గోదావరి ఉన్న మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందారని అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రఘునాథ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, అమిరిషెట్టి రాజు, బోయిని హారి కృష్ణ, జోగుల శ్రీదేవి, కంకణాల సతీష్, పట్టి వెంకట కృష్ణ, మెరేడికొండ శ్రీనివాస్, వూట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.