విద్యార్థినుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి
-వీసీని కోరిన తెలంగాణ గవర్నర్
-48 గంటల్లో అందచేయాలని ఆదేశాలు
-అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులను కోరిన తమిళ్ సై
Governor Tamil Sy:బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలపై తెలంగాణ గవర్నర్ తమిళ్ సై స్పందించారు. వరుస ఘటనలపై తనకు నివేదిక అందించాలని కోరారు. అదే సమయంలో విద్యార్థులు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తీవ్ర చర్యలకు దారితీసిన ఘటనలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ వైస్ ఛాన్సలర్‌ను కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై విద్యార్థులు తీవ్ర చర్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉన్నత విద్య అభ్యసించే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ విషయంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న చర్యలతో సహా 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు.