కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఉరేసుకుంటా..

-రేవంత్‌రెడ్డి ప‌ట్ట‌ప‌గలు దొరికిన దొంగ‌
-చంద్ర‌బాబునాయుడుకి నౌక‌రుగా ప‌నిచేసిండు
-ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం
-రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జోగురామన్న ఆగ్ర‌హం

Mla Jogu Ramanna: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరేసుకుంటాన‌ని… లేక‌పోతే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నీవు ఆత్మహత్య చేసుకుంటావా..? అని ఎమ్మెల్యే జోగురామన్న సవాల్ విసిరారు. శుక్ర‌వారం ఆయ‌న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. నీకు నమ్మకం ఉంటే నేను చేసిన సవాల్ స్వీకరిస్తావా..? అని ప్ర‌శ్నించారు. పట్టపగలు వోటుకు నోటు కేసులో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని దుయ్య‌బ‌ట్టారు.

మరోసారి అమర్యాదగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఇటివల రేవంత్ రెడ్డి తనను, తన ఇంటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై మండిప‌డ్డారు. బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను కాబట్టే ఓర్వలేక రేవంత్‌రెడ్డి త‌న‌ను అవమానిస్తున్నారని అన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు నౌకరుగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు.

మా ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీపై అమర్యాదగా మాట్లాడితే నాలుక చీరేస్తామ‌ని జోగు హెచ్చ‌రించారు. న‌న్ను కించపర్చే విధంగా మాట్లాడావు.. బడుగు బలహీన వర్గాల‌ ఎమ్మెల్యేను అవమానించిన‌ నువ్వు వెంట‌నే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన చోట అంబేద్కర్ విగ్రహం ఉంటే కనీసం పూల మాల వేయలేదు.. దళితులను అవమానించావు.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాన‌ని రామ‌న్న స్ప‌ష్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో‌‌ అభివృద్ధి పై తాను బహిరంగ చర్చకు సిద్దమ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like