దుర్గం చిన్నయ్యో… దుర్భుద్ది చిన్నయ్యో..
-ఆయన గురించి మాట్లాడాలంటేనే సిగ్గవుతోంది
-కానీ, కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
Anumula Revanth Reddy: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గవుతోంది.. కానీ కేసీఆర్ పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారు.. ఆయనకు సిగ్గనిపించడం లేదా..? అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుములు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మాజీ మంత్రి గడ్డం వినోద్ సమక్షంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వస్తున్న ఆరోపణలు దారుణమన్నారు. బెల్లంపల్లి శాసనసభ్యుడిపై జరుగుతున్న ప్రచారం దేశస్థాయిలో ప్రజలందరికీ తెలిసింది కానీ, చంద్రశేఖర్‌రావుకు ఎందుకు కనిపిస్తదలేదు… ఆయనకు ఎందుకు తెలుస్తలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన దుర్గం చిన్నయ్యనో.. దుర్భుద్ది చిన్నయ్యనో అర్దం కావడం లేదన్నారు. ఏ అరాచకం చూసినా అందులో బీఆర్ఎస్ నాయకులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చేవి కానీ, ఇప్పుడు అత్యాచారం కేసుల్లో సైతం బీఆర్ఎస్ నేతలు ఉంటున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వినోద్ లాంటి వ్యక్తి క్షేత్రస్థాయిలో పనిచేస్తే పార్టీ ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.