విద్యా దినోత్సవంలో విషాదం.. బాలుడు దుర్మరణం

Telangana: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యా దినోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఘటన చోటచేసుకుంది. ట్రాక్టర్ కింద పడి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇనుగాల జయపాల్-స్వప్న దంపతుల కుమారుడు ధనుష్(10) 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం స్కూల్లో విద్యా దినోత్సవ ర్యాలీ తీశారు . దీనికి ధనుష్ కూడా వెళ్లాడు. ర్యాలీ తీస్తుండగా కిరాణం దుకాణం వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటుండగా ధనుష్ వెంట కుక్కలు పడ్డాయి. వాటిని తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్ కింద పడ్డాడు. అక్కడికక్కడే బాలుడు మృతి చెందగా కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే విద్యార్థుల ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.