కాసిపేట 2గనిలో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభం
Singareni:కాసిపేట 2 గనిలో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభమయ్యాయి. గని మేనేజర్ లక్ష్మీనారాయణ కొబ్బరికాయ కొట్టి మ్యాన్ రైడింగ్ పనులు మొదలు పెట్టారు. అనంతరం గని మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 5 నెలలో మ్యాన్ రైడింగ్ పనులు పూర్తి చేసి గని ఉత్పత్తి పెంచుతామని అన్నారు. కాసిపేట 2 గనిని మందమర్రి ఏరియాలోనే ఉత్పత్తిలో ముందంజలో ఉంచుతామని స్పష్టం చేశారు. అదే సమయంలో రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ, సేఫ్టీ అధికారి సంతోష్ రావు, ఇంజనీర్ రఘు, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, వెల్ఫేర్ ఆఫీసర్ భార్గవ్, అండర్ మేనేజర్ శ్యాంసుందర్, సర్వేయర్ ప్రకాశ్, కోత్తపల్లి శంకరయ్య, ఏఐటీయూసీ మైన్ కమిటీ మెంబర్ రాజకొమురయ్య తదితరులు పాల్గొన్నారు.