విప్రో గుడ్‌ న్యూస్‌.. కొత్తగా 25,000 ఉద్యోగాలు..

2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఏకంగా 25,000కిపైగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు విప్రో సంస్థ తెలిపింది. ఇటీవల జరిగిన ఇన్వేంటర్‌ డే 2021 కార్యక్రమంలో భాగంగా విప్రో ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోవిల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన అభ్యర్థులను సంస్థలోకి తీసుకోవడానికి విప్రో కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే పలు రకాల ప్రోగ్రామ్స్‌ కోసం ఉద్యోగుల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

▪️ విప్రోలో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక గతేడాది ఈ సంస్థ 17,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంది.

▪️ ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ సైతం కాలేజీ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఐటీ తో పాటు ఇతర ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో కేవలం ఐఐటీల నుంచే 260 మందిని తీసుకోనున్నట్టు శామ్‌సంగ్ ఇండియా హెచ్‌ఆర్‌ విభాగం హెడ్ సమీర్ వాధవన్ తెలిపారు.

▪️ మిగిలిన వారిని ఎన్‌ఐటీ, ఐఐఐటీ, బిట్స్ పిలానీ వంటి ఇతర సంస్థల నుంచి రిక్రూట్‌ చేసుకోవాలని శామ్‌సంగ్‌ యోచిస్తోంది. ఈ ఏడాది నియామకాలు చేపట్టే మొత్తం 1,000 ఉద్యోగాల్లో 250 మందికి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు వాధవన్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like