తిరుమల ఘాట్ రోడ్ల మూసివేత.. బస్సులు కూడా బంద్..
భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట రోడ్ల మూసివేయడమే కాకుండా, పైకి బస్సులు కూడా బంద్ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా తిరుపతి, తిరుచానూరులో భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తిరుపతిలో అంధకారం నెలకొంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. భారీ వర్షం కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి, తిరుమల క్షేత్రాల్లో గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా తిరుపతి- తిరుమల ఘాట్ రోడ్లను మూసివేస్తు్న్నట్లు
పరిస్థితులు అనుకూలించిన తర్వాతే..
ఎడతెరిపి లేని వర్షాలతో తిరుమల కనుమ రహదారుల్లో కొండ చరియలు, చెట్లు విరిగిపడుతున్నాయి. కనుమ రహదారుల్లో చాలా చోట్ల ఇప్పటికే కొండ చరియలు విరిగిపడడంతో జేసీబీల సహాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భక్తుల రాకపోకలు అంత సురక్షితం కాదని టీటీడీ భావించింది. అందుకే గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి 7.30 గంటల నుంచే బస్ టికెట్ల జారీని ఆపేశారు. పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాతే బస్సులను పునరుద్ధరిస్తామన్నారు.