అధికారుల ఆందోళనకు INTUC నేతల మద్దతు

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా అధికారులు చేస్తున్న ఆందోళనకు INTUC నేతలు మద్దతు తెలిపారు. నాలుగవ రిలే నిరహార దీక్ష చేస్తున్న అధికారులకు INTUC నేతలు గడ్డం తిరుపతి, బెల్లం శ్రీనివాస్, కే ఎన్ చారి, మడ్డి రాజ్ కుమార్, పలువురు INTUC నేతలు సంఘీభావం తెలిపారు. సీఎంఓఏఐ సింగరేణి బ్రాంచి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పే అప్గ్రేడేషన్ , పీఆర్పీ చెల్లింపుతో పాటు ఇతర డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. 13 జులై వరకు జరిగే రిలే నిరాహారదీక్షలలో పెద్ద సంఖ్యలో అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని… దీక్షలో పాల్గొనే వారికి ప్రతీ రోజు ఏరియా అధికారులు సంఘీభావం ప్రకటించాలని కోరారు. సింగరేణి అర్జీ 3 &ఏపీఎ అధికారుల నిరసన వర్షంలో సైతం కొనసాగడం గమనార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like