స‌ర్ నోటీసులపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాలి

‘సర్‌’ లో భాగంగా జారీ చేసే ప్రతి నోటీసు విష‌యంలో ఓట‌ర్ల‌కు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలని అద‌న‌పు క‌లెక్ట‌ర్ (స్థానిక సంస్థ‌లు) చంద్ర‌య్య స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో ఓట‌ర్ల‌కు ఇచ్చే నోటీసులపై త‌నిఖీ చేశారు. నోటీసులు సంబంధిత ఓటరుకు బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌వో) వ్యక్తిగతంగా అందించాలన్నారు. నోటీసులు ఇచ్చే స‌మ‌యంలో ఓట‌రుకు నోటీసు ఎందుకు ఇస్తున్నామో..? ఏయే ప‌త్రాలు అందించాలో…? స్ప‌ష్టం చేయాల‌ని వెల్ల‌డించారు.

నోటీసుల అందజేత నుంచి విచారణ నిర్వహణ వరకు ప్రతి దశపై అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని చెప్పారు. ‘సర్‌’ ప్రక్రియలో నిర్దేశించిన విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించవ‌ద్ద‌న్నారు. ప్రతి కార్యకలాపాన్ని పద్ధతి ప్రకారం నిర్వహించి, దానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వేగవంతం చేయడంతోపాటు, ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.

కార్య‌క్ర‌మంలో త‌హ‌సీల్దార్ జ్యోత్స‌, ఆర్ఐ ముర‌ళీ, మాదారం ఉప‌స‌ర్పంచ్ సూరం దామోద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like