మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు…
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అన్నారు. దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. భక్తులకు సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక ఆధ్యాత్మిక ప్రాధాన్యత పెంచేలా గూడెం గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, DCP భాస్కర్, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ ఈఓ శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు నలిమెల రాజు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.