సింగరేణి కార్మికులకు పరామర్శ
సింగరేణిలో ప్రమాదానికి గురైన కార్మికులను TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి పరామర్శించారు. నాలుగు రోజుల కిందట కాసిపేట గనిలో బాంబు మిస్ బ్లాస్ట్ కావడంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. వారంతా బీజోన్ సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్ర కార్మికులు క్రాంతి కుమార్, రాజ్ కుమార్ లను నాతరి స్వామి పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఆయనతో పాటు యువ నాయకులు మారపాక వంశీ, MRPS నాయకులు మచ్చ రాజేష్, మచ్చ మణిరాజు, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.