వేములవాడలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి జనం పోటెత్తుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడెల మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అన్న పూజలు, కుంకుమ పూజలు మరియు వివిధ రకాల నోములు, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దర్శనం సులభంగా అయ్యేలా ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు.