మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పెత్తందార్ల దురాగతాలకు, నాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరాడిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ జయంతి సందర్భంగా ప్రజాసేవకు మరింత అంకితభావంతో పనిచేయాలని, అదే చాకలి ఐలమ్మకు మనం అందించే నిజమైన నివాళి అని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఓ శ్రీనివాస్,ఆర్ఐలు శేఖర్,సీసీ సందీప్, సీపీఓ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.