రైతులకు అందుబాటులో ఉంటూ సాయం చేయాలి
PACS కమిటీ రైతులకు అందుబాటులో ఉంటూ సాయం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్నారు. ఆయన హజీపూర్ మండలం కర్ణమామిడి PACS నూతన బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సహకార రంగం బలోపేతం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి PACSలు కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను గుర్తించి, సహకార స్ఫూర్తితో ముందుకు సాగాలని నూతన పాలకవర్గానికి సూచించారు..
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన PACS కమిటీని ఎమ్మెల్యే శాలువాలుతో సన్మానించారు. అనంతరం గ్రామ నాయకులు, ప్రజలు కమ్యూనిటీ హాల్ మౌలిక వసతుల కోసం డబ్బులు మంజూరు చేయాలని చెప్పగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు భూమయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, పడ్తనపల్లి PACS చైర్మన్, హజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా OBC చైర్మన్ వొడ్డే రాజమౌళి తదితరులు పాల్గొన్నారు..