వాయిదాల పద్దతిలో లంచం

పాపం ఎంత మంచి అధికారిణో… డబ్బులు ఒక్కసారి ఇచ్చుకోలేరని తెలిసి నెలవారీగా ఇచ్చేలా వారికీ వెసులుబాటు ఇచ్చింది… అయినా ఆమె మంచి తనం అర్ధం చేసుకోలేక ఏసీబీ కి పట్టించారు…

ఈమె పేరు దారోజు పద్మ.. మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)గా పనిచేస్తున్నారు. తన పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ తనిఖీల్లో ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు గాను, ఆమె పరిధిలోని 21 మంది అంగన్వాడీ సూపర్‌వైజర్ల నుంచి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేశారు. దీని ప్రకారం, ఒక్కో సూపర్‌వైజర్ నెలకు రూ. 1000 చొప్పున ఆమెకు లంచంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో, మూడు నెలలకు సంబంధించిన మొత్తాన్ని ఆమె ఏకమొత్తంగా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. 21 మంది నుంచి రూ.63,000 లంచం తీసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు.

లంచం తీసుకుంటున్న సమయంలో పద్మను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాపం వాళ్ళ పై ఒకే సారి భారం పడకుండా ఆమె ఆలోచిస్తే వెళ్లేమో ఆమెను అరెస్ట్ చేయించారు.

You might also like