బతుకమ్మ వేడుకల్లో విషాదం

సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.. పూల పండుగ వేళ ఓ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.. బతుకమ్మ ఆడుతూ ఓ యువతి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన 25 ఏళ్ల శ్రీవాణి.. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తన మేనత్త ఇంటికి వచ్చింది.. ఈ క్రమంలో బతుకమ్మ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీవాణి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..

You might also like