రక్తదానం ప్రాణదానం తో సమానం
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
Blood donation is equal to life donation:రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తల సేమియా వ్యాధిగ్రస్తుల కు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రక్తదాన శిబిరాల్లో ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభ పరిణామం అన్నారు. రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు ఎస్ శ్రీనివాసరావు, సి సమయ్ జాన్ రావు, ఉట్నూర్ ఎ ఎస్.పి హర్షవర్ధన్, డి.ఎస్.పి వి ఉమేందర్, మెడికల్ అధికారి రిమ్స్ డాక్టర్ రాజ్యలక్ష్మి, సిఐలు పి సురేందర్, బి రఘుపతి, కే శ్రీధర్, కే మల్లేష్, కే నరేష్ కుమార్, ఈ చంద్రమౌళి, జె కృష్ణమూర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, బి శ్రీ పాల్, ఎం వంశీకృష్ణ, రిమ్స్ సిబ్బంది స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్స్, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.