కాంగ్రెస్ సభలో జాతీయ జెండాకు అవమానం
Congress: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikharjun Kharge) పాల్గొన్న సభలోనే జాతీయ జెండాకు అవమానం జరిగింది. పార్టీ నేతలు జాతీయ జెండాను పట్టించుకోకుండా సైడ్ వాల్గా ఉపయోగించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలోని నస్పూర్లో శుక్రవారం జై భారత్ సత్యాగ్రహ సభ నిర్వహించారు. బహిరంగ సభ వద్ద ఎన్జీవోల బిల్డింగ్ల వైపు (కుడిపక్కన) జాతీయ జెండాను సైడ్వాల్స్ లాగా కట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఈ జాతీయ జెండాతోనే ప్రదర్శన నిర్వహించారు. అదే జెండాను ఇప్పుడు సైడ్వాల్ లా ఉపయోగించడం గమనార్హం.