డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Transfer of Deputy Collectors: రాష్ట్రంలో 15 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తు తం వివిధ జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లుగా పనిజేస్తున్నవారిని ఆయా జిల్లాలకు అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే మరికొంత మందిని ఆర్డీవోలుగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరో ముగ్గురిని కూడా ఈ బదిలీల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ట్రాన్స్ఫర్ చేశారు.
వికారాబాద్ అదనపు కలెక్టర్ గా జి. లింగ్యా నాయక్, గద్వాల అదనపు కలెక్టర్‌గా సి. హెచ్ శ్రీనివాసులు, నారాయణపేట అదనపు కలెక్టర్‌గా పి. అశోక్ కుమార్, వికారాబాద్ డీఆర్వోగా ఎస్. తిరుపతి రావు, షాద్ నగర్ ఆర్డీఓగా డి. వెంకట మాధవరావు, ఆసిఫాబాద్ ఆర్డీవోగా కె. సురేశ్, ఉట్నూర్ ఆర్డీఓగా కె.మహేశ్వర్, ఆర్మూర్ ఆర్డీఓగా టి. వినోదక్కుమార్, ఆందోల్ ఆర్డీఓగా ఆర్.పాండు, నల్గొండ ఆర్డీఓగా ఎన్.రవి, దేవరకొండ ఆర్డీఓగా బి. శ్రీరాములు, సింగరేణి భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. జయశ్రీ జనగాం భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా వి. సుహాసిని, పాల్వంచ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా డి. ప్రేమరాజ్ బదిలీ అయ్యారు.