బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం

BJP: బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్‌ను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఖమ్మం జిల్లాలో ఓ కార్యకర్త ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం బీజేపీ పార్టీ అర్బన్ టౌన్ ఉపాధ్యక్షుడుగా గజ్జల శ్రీనివాస్ కొనసాగుతున్నాడు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడంతో తీవ్ర మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పార్టీ నేతలు, తన సహచరులకు ఫోన్ చేసిన శ్రీనివాస్ సంజయ్ అన్నను తొలగించడం నేను తట్టుకోలేకపోతున్నా అంటూ అందరికీ ఫోన్లు చేసి ఇక సెలవ్ అంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.