రైల్వే వ్యాగన్లో మంటలు

Railway: ఓ రైల్వే వ్యాగన్లో మంటలు చెలరేగటంతో సకాలంలో దానిని గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని రైల్వే స్టేషన్ నుంచి బుధవారం బొగ్గు లోడ్‌తో రైల్వే వ్యాగన్ బయల్దేరింది. ఈ వ్యాగన్లో బుధవారం మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆగింది. అక్కడ వ్యాగన్లో మంటలను గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.