మంచిర్యాల ఆసుపత్రిలో దారుణం
Manchryala: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తిని పక్కనే ఉన్న మరో రోగి పొడవడంతో బాధితుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. లక్షెట్టిపేట ప్రాంతం ఇటిక్యాల గ్రామానికి చెందిన చిలుక దేవయ్య (49 )సం.లు అనారోగ్యంతో మూడు రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. ఇతని పక్క బెడ్లో చికిత్స నిమిత్తం వచ్చిన వ్యక్తి అర్ధరాత్రి కత్తితో చిలుక దేవయ్యపై ఛాతిపై పొడిచాడు. గాయపడ్డ చిలుక దేవయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న దేవయ్య ఈ రోజు మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేవయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.