బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి విరాళం

Bugga Rajarajeshwara Swamy Temple: బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఓ భక్తుడు విరాళం అందించారు.బుగ్గ రాజేశ్వర ఆలయంలోని శివలింగానికి “నాగ శేష శంకర రూప మకుటం” అందించారు. చిద్రాల భావనారుషి, అనిత దంపతుల చేతుల మీదుగా ఆలయానికి దీనిని అందచేశారు. ఆలయ కమిటీ తరఫున చైర్పర్సన్ మాసాడి శ్రీదేవీ దంపతులు దీనిని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సంతోష్‌కుమార్, గోపి, వెంకటస్వామి, ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.