సోనియా, రాహుల్ విమానం అత్యవసర ల్యాండింగ్

Congress: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరులో జరిగిన విపక్ష పార్టీల కూటమి సమావేశంలో పాల్గొన్న వీరిద్దరూ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. అయితే, వాతావరణం ప్రతికూలంగా మారడంతో భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భోపాల్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అనంతరం వీరు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.