టమాట లారీ బోల్తా.. పోలీసుల బందోబస్తు…

Tomato: ఇప్పుడు ఏ నోట విన్నా.. టమాట గురించే.. ఎక్కడ చర్చ జరిగినా దాని గురించే.. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయ్యింది. టమాట రైతులు లక్షలు, కొన్ని చోట్ల కోట్లు కూడా సంపాదించేస్తున్నారు. అయితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కొద్ది రోజులుగా టమాట లారీలు బోల్తా కొడుతున్నాయి. అటు లారీలు బోల్తా పడటం, వాటిని ఎత్తుకుపోకుండా పోలీసులు కాపాలాకాయాల్సిన పరిస్థితి.
కొమురం భీం జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామ శివారులోని జాతీయ రహదారిపై టమాటా లోడుతో, వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా.. 15 లక్షల విలువ చేసే టమాట నేలపాలైంది. వాహనం బోల్తా పడడంతో అందులోని టమాటాలు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడిపోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక జనం టమాటల కోసం ఎగబడ్టారు. అయితే డ్రైవర్ అప్పటికే అలర్ట్ అయి స్థానికుల పోలీసులకు సమచారం ఇవ్వడంతో టమాటలు దొంగిలించకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
వారం రోజుల క్రితం.. జూలై 15న కర్ణాటక కొల్లార్ నుండి ఢిల్లీ వెళుతున్న టమాట లారీ ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద బోల్తా పడింది. 30 లక్షల విలువ చేసే టమాట లోడ్ నేల పాలవడంతో జనం టమాటల కోసం ఎగబడ్డారు.. వాటికి సైతం పోలీసులు గన్ లతో కాపాలాకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.