బీఆర్ఎస్ ఎంపీకి సుప్రీంలో ఎదురుదెబ్బ
Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ ఉదయమే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించగా ఇప్పుడు మరో ప్రజాప్రతినిధిపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్(BRS MP Bibi Patil)పై అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court)విచారణ చేపట్టగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆయన పిటిషన్ తోసిపుచ్చింది.
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్లో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు మరో ప్రజాప్రతినిధిపై అనర్హత విషయంలో సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అనర్హత పిటిషన్పై హైకోర్టు(Telangana High Court)లోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బీబీ పాటిల్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ విజయం సాధించారు. ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున బీబీ పాటిల్ ఎంపిక చెల్లదంటూ కె. మదనమోహన్ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది.
అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. బీబీ పాటిల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. బీబీ పాటిల్ వేసిన పిటిషన్పై మంగళవారం రోజు సర్వోన్నత న్యాయస్థానం విచారించగా.. బీబీ పాటిల్ వాదనల్లో మెరిట్స్ లేనందున పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం ఎంపీకి సూచించింది.