ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
Suspension of three employees: వరదల నేపథ్యంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులలో ప్రత్యేక విధులు కేటాయించిన ముగ్గురు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని అన్నారు. ఉప్పొంగుతున్న వాగులు, నదుల వద్ద ప్రజారక్షణ కోసం నియమించిన తుంపెల్లి పంచాయితీ కార్యదర్శి, వీఆర్ఏ అలసత్వం కారణంగా ఎనిమిది సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడని అన్నారు. ఈ కారణంగా వీరితో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జనకాపూర్ వీఆర్ఏను ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం-2005 కింద సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.