బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి

BJP: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కీలక బాధ్యతలను అప్పగించింది హైకమాండ్. తాజాగా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలోకి ఆయన్ను తీసుకుంది. బండి సంజయ్‌ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సత్యకుమార్ (ఏపీ), తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌ను కొనసాగించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు ఇచ్చారు.