దళిత యువకున్ని చితకబాదిన కానిస్టేబుల్

Telangana Police:విచారణ పేరుతో ఓ దళిత యువకున్ని చితక బాదాడు ఒక కానిస్టేబుల్… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. అడ్డూరి సాయి కిరణ్ అనే యువకుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీలో నివాసం ఉంటున్నాడు. మహతి ఇంటర్నెట్ సెంటర్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 7.30 ప్రాంతంలో సంపత్ అనే కానిస్టేబుల్ ఆ యువకుడి వద్దకు వచ్చి నా వెంట రమ్మంటూ తీసుకువెళ్లాడు. తనను బెల్లంపల్లి పోలీసు కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి బట్టలు విప్పించి కూర్చొబెట్టారు. బూతులు తిట్టడమే కాకుండా, అనుదీప్ నీకు దోస్త్ కదా..? ఎక్కడ ఉన్నాడో చెప్పాలని చితకబాదాడు. చెప్పకపోతే నిన్ను వాడి కేసులో ఇరికిస్తారా..? అంటూ వీడియోలు సైతం తీసినట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తనను చితకబాదడమే కాకుండా, కులం పేరుతో దూషించిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.