విఠల్ రావు గద్దర్ ఎలా అయ్యాడు..
Gaddar: విఠల్‌రావు అంటే చాలా మందికి తెలియదు.. కానీ, గద్దర్ అంటే చాలు చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు పాటల మాంత్రికుడని చెబుతారు. విఠల్‌రావు గద్దర్‌గా మారడానికి పెద్ద కారణమే ఉంది.. ప్రపంచానికి గద్దర్ గా తెలిసిన అతని అసలు పేరు విఠల్ రావు. గద్దర్ రాసిన పాటలు జననాట్య మండలి పుస్తకాల్లో అచ్చయ్యేవి. అయితే, పాటలు రాసిన వాళ్ల పేర్లు నేరుగా పెడితే పోలీసులు, ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పేవి కాదు. దీంతో ఆయన పేరు మార్చి పాటలు రాయాలని సూచించడంతో గదర్‌గా మార్చుకున్నారు. గదర్ అంటే పంజాబీ భాషలో విప్లవం అని అర్దం. పుస్తకాల్లో గదర్ అనే పేరుకు బదులు గద్దర్‌గా ప్రింట్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు గద్దర్‌గానే స్థిరపడిపోయింది.