గద్దర్ అంత్యక్రియల్లో విషాదం

Gaddar:తెలంగాణ ప్రజా యుద్ద నౌక, గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాద చోటు చేసుకుంది. గద్దర్ అంతిమయాత్ర ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌లోని మహాబోధి స్కూలు వరకు సాగింది. అన్నీ రంగాల ప్రముఖులు, సామాన్యులు పాల్గొని గద్దర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో గద్దర్ అభిమాని, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృత్యువాత పడ్డారు.
గద్దర్‌ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. అక్కడే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో జహీరుద్దీన్ అలీఖాన్ అంతిమయాత్ర వాహనం వెంటనే ఉన్నారు. తొక్కిసలాట సందర్భంగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. సీపీఆర్ చేసి, ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా, ఫలితం దక్కలేదు. గద్దర్ మీద ఉన్న అభిమానంతో అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వచ్చారు. విషాదకర రీతిలో మృతి చెందారు.